NTV Telugu Site icon

Harish Shankar: పెద్ద స్కెచ్ వేసిన హరీశ్.. ఆ కండలవీరుడితో..

Harish Shankar Salman

Harish Shankar Salman

Harish Shankar Planning A Pan India Film With Salman Khan: ‘గద్దలకొండ గణేశ్’తో హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. ఒక పెద్ద సినిమా చేయాలని భీష్మించుకు కూర్చున్న అతనికి.. స్టార్ హీరోల డేట్స్ దొరకడం లేదు. పవన్ కళ్యాణ్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాని ప్రకటించాడు కానీ, అది ఇంతవరకూ పట్టాలెక్కలేదు. రాజకీయాలతో పాటు ఇతర ప్రాజెక్టులతోనూ పవన్ బిజీగా ఉండటంతో.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో క్లారిటీ లేకుండా పోయింది. పోనీ.. ఇతర స్టార్స్‌తో సినిమా చేద్దామంటే, ఎవ్వరూ ఖాళీగా లేరు. దీంతో.. హరీశ్ శంకర్ బాలీవుడ్ స్కెచ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో హరీశ్ శంకర్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి ప్లాన్ చేస్తున్నాడట! ప్రస్తుతం ముంబైలో ఉన్న హరీశ్.. సల్మాన్ కోసం అతని ఇమేజ్‌కి తగినట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య ఒకసారి చర్చలు జరిగాయట! సల్మాన్ కథ వినడమే కాదు, బాగుందని కూడా చెప్పాడట! అయితే.. సినిమా చేస్తాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా, అయోమయంలో పడేసినట్టు తెలిసింది. అయితే.. హరీశ్ మాత్రం సల్మాన్‌తో ఎలాగైనా ఈ సినిమా చేయాల్సిందేనని పట్టుబడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ముందుకొచ్చింది. మరీ, ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

ఒకవేళ సల్మాన్, హరీశ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయితే మాత్రం.. హరీశ్ పంట పండినట్టే! ఈ దెబ్బతో అతడు పాన్ ఇండియా దర్శకుడిగా అవతరించడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే.. ఒక తెలుగు హీరోని సైతం రంగంలోకి దింపేలా హరీశ్ ప్లాన్ చేస్తున్నాడట! సల్మాన్‌కి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు కదా.. కాబట్టి తెలుగు ప్రేక్షకులకూ మచ్చిక చేసుకోవాలంటే, ఇక్కడ మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడ్ని తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.