మిరపకాయ్ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీలో ఒక చిన్న ఎటకారం ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అరవై కేజీల యాటిట్యూడ్ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ డైలాగ్స్ చెప్తుంటే భయం పుడుతుంది. ఈ మూడు క్యారెక్టర్స్ ఉన్న కామన్ పాయింట్ హరీష్ శంకర్ ‘పెన్ పవర్’. పూరి తర్వాత ఆ స్థాయిలో హీరో క్యారెక్టర్ తో సినిమాని, వన్ లైనర్ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ని ఇవ్వగల ఏకైక రైటర్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. అందుకే తన నుంచి సినిమా వస్తుంది అనగానే మూవీ లవర్స్ అన్-లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అయిపోతారు. 2019 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవ్వాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరి విష్ ని నిజం చేస్తూ హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యింది. ప్రీప్రొడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకోని, పవన్ సెట్స్ పైకి రావడం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడు హరీష్ శంకర్.
ఎట్టకేలకు ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు హరీష్ శంకర్. తనకి మాత్రమే సొంతమైన ఫన్ టైమింగ్ ని చూపిస్తూ… ది డే హాజ్ అరైవ్డ్ అంటూ ట్వీట్ చేసిన హరీష్ శంకర్, “ఎన్నాళ్లో వేచిన ఉదయం, ఈరోజే ఎదురవుతుంటే” సాంగ్ ని పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ అండ్ సాంగ్ ని చూస్తే ఎవరైనా కాసేపు నవ్వుకోవాల్సిందే. పవన్ ఫాన్స్ అంతా హరీష్ శంకర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది రీమేక్ సినిమా కదా, రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతున్నారు. తెరపై మాటలు మార్పులు అనే టైటిల్ కార్డ్ పడిన తర్వాత రీమేక్ అయితే ఏంటి ఒరిజినల్ అయితే ఏంటి భయ్యా? థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ సంభవం గ్యారెంటీగా చూస్తారు. అయినా పవన్ ఫాన్స్ ఏదేదో అలోచించి భయపడుతున్నారు కానీ హరీష్ శంకర్ లా పవన్ కళ్యాణ్ ని చూపించాలి అంటే ఆపోజిట్ లో కూడా హరీష్ శంకరే ఉండాలి. ఈ విషయంలో డౌట్ ఉన్న వాళ్లు ఎవరైనా సరే వెళ్లి గబ్బర్ సింగ్ సినిమాని రిపీట్ వేసేయొచ్చు.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023