NTV Telugu Site icon

Harish Shankar: రీమేక్స్ మాస్టర్… ఒరిజినల్ చూసినోడు కూడా విజిల్స్ వేయాల్సిందే

Harish Shankar

Harish Shankar

పూరి జగన్నాథ్ తర్వాత ఆ రేంజులో కేవలం హీరో క్యారెక్టర్ పైన కథలు, వన్ లైనర్ డైలాగులు రాయగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు హరీష్ శంకర్. ఈ మాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజా రవితేజ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరమే లేదు. మిరపకాయ్ లాంటి ఘాటు సినిమాని ఇచ్చిన ఈ ఇద్దరు రైడ్ సినిమాని రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమా ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతుంది అనే విషయం తెలియగానే… ఒక వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో ఇది కూడా రీమేకేనా? హరీష్ శంకర్ అన్ని ఇవే చేస్తాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్లు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే… హరీష్ శంకర్ ఒక సినిమాని రీమేక్ చేస్తే అది ఒరిజినల్ కన్నా బాగుంటుంది, ఒరిజినల్ చూసిన వాడు కూడా రీమేక్ చూసి విజిల్ వేస్తాడు. అది హరీష్ శంకర్ స్పెషాలిటీ.

దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసిన హరీష్ శంకర్… పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాని కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు మూవీ లవర్స్ అందరూ చూసారు. దబాంగ్ సినిమా కన్నా హండ్రడ్ టైమ్స్ బెటర్ ఉంటుంది గబ్బర్ సింగ్ మూవీ. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ సినిమాలో మిస్ అయిన ఎనర్జీని గడ్డలకొండ గణేష్ సినిమాలో చూపించాడు హరీష్ శంకర్. ఈ రెండు సినిమాలని హరీష్ శంకర్ చాలా స్పెషల్ గా డీల్ చేసాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రీమేక్ అయినా రైడ్ మూవీ కన్నా పక్కాగా బెటర్ గా ఉంటుంది. అజయ్ దేవగన్ కాస్త సెటిల్డ్ గా ఉంటాడు, రవితేజ క్యారెక్టర్ పక్కా పెప్పీగా ఉంటుంది. అంతెందుకు రైడ్ టైటిల్ కి మిస్టర్ బచ్చన్ టైటిల్ కే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. టైటిల్ నుంచే మార్పులు మొదలుపెట్టిన హరీష్ శంకర్… రైడ్ సినిమాతో తను రీమేక్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Show comments