పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read :Game Changer controversy : తమ్ముడు శిరీష్ విధ్వంసం.. అన్న దిల్ రాజు డ్యామేజ్ కంట్రోల్
కాగా ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ గురువారం రిలీజ్ కాబోతుంది. అందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రైలర్ ను చెక్ చేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఈ ట్రైలర్ లో అనేక సర్పైజ్ లు ప్లాన్ చేసారు మేకర్స్. మొత్తం మూడు నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ లో 40 ఫ్రేమ్స్ ఉండబోతున్నయట. ప్రతి ఫ్రేమ్ దేనికదే హైలెట్ గా ఫ్యాన్స్ కు విజువల్ వండర్ లా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ కోసం మూడు లైన్ లు ఉండే డైలాగ్ ను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాసారు. ఈ డైలాగ్ కు తమిళ యంగ్ హీరో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తోం అంచనాలు పెంచిన హరిహర ఇప్పడు రాబోయే ట్రైలర్ ఆ అంచాలను మరింత రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
