NTV Telugu Site icon

Hari Hara Veera Mallu: ఆగిపోలేదు… అలా అని అవ్వట్లేదు

Hariharaviramallu

Hariharaviramallu

ఏదో ఉన్నామంటే ఉన్నాం… అన్నట్టే ఉంది హరిహర వీరమల్లు పరిస్థితి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ‌ర్త్‌డేలు వ‌స్తున్నాయ్‌ పోతున్నాయ్ కానీ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ అసలు మ్యాటర్ తేలడం లేదు. దీని తర్వాత మొదలు పెట్టిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. చివరగా మొదలైన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. క్రిష్ హరిహర వీరమల్లు మాత్రం ఏళ్ల త‌ర‌బ‌డి షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్ అయినప్పుడు పవన్ వారియర్ లుక్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. పవన్ అనౌన్స్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో… ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే… ఈ సినిమా మొదలైన తర్వాత ప‌వ‌న్ చేసుకుంటున్న మూడో బర్త్ డే ఇది.

లాస్ట్ ఇయర్ సాలిడ్ గ్లింప్స్‌ రిలీజ్ చేసిన మేకర్స్… ఈసారి కూడా కాస్త హడావిడి చేశారు. పవన్ వీరుడి గెటప్‌లో ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విష్ చేస్తూ… అర్ధరాత్రి 12 గంటలకు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సరికొత్తగా కనిపిస్తున్నాడు పవన్. ఇప్పటి వరకూ కోర మీసాలతో కనిపించిన వీరమల్లు.. ఈ నయా లుక్‌లో మాత్రం గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్‌ కిక్ ఇస్తున్నా.., అసలు మ్యాటర్ మాత్రం చెప్పలేదు మేకర్స్. ఈ పోస్టర్‌తో హరిహర వీరమల్లు ఆగిపోలేదు.. షూటింగ్ కాస్త లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప రిలీజ్ డేట్, షూటింగ్ అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు. అసలు ఈ సినిమా ఎప్పుడొస్తుందో మేకర్స్‌కు అయినా క్లారిటీ ఉందా? అనేది డౌటే. ఈ సినిమా లైన్లో ఉందనే విషయం మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Show comments