Site icon NTV Telugu

HHVM : స్టార్ హీరో బ్యానర్ పై హరహర వీరమల్లు కేరళ రిలీజ్

Hariharaveeramallu

Hariharaveeramallu

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.  పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు ఏ ఎం రత్నం దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు వాయిదాలు మీద వాయిదాలు పడుతూ మొత్తానికి ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ కాలేదని సమాచారం.

Also Read : Akanksha Sharma : పరువాల కౌగిలిలో ఫ్యాన్స్ ను నలిపేస్తున్న ‘లైలా’ బ్యూటీ ఆకాంక్ష శర్మ

పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కేరళలో ఓ ప్రముఖ హీరో రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానేర్ పై కేరళలో అనేక సినిమాలు నిర్మించాడు. అలాగే ఎన్నో సినిమాలను తన బ్యానర్ పై రిలీజ్ చేసాడు. ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లును కూడా మల్లూ వుడ్ లో దుల్కర్ సల్మాన్ సంస్థ రిలీజ్ చేయబోతుంది. ఈ విషయాన్నీ అఫీషియాల్ గా ప్రకటించారు మేకర్స్. కేరళలో పవన్ కళ్యాణ్ సినిమాకు బిగ్ రిలీజ్ దొరికినట్టే. ఇటు తెలుగు రాష్ట్రాల రిలీజ్ కు సంబంధించి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version