Site icon NTV Telugu

Happy Ending: యశ్ పూరి… ఏమిటీ బాబా శాపం ఇచ్చాడా!?

Happy Ending

Happy Ending

Yash Puri: యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. త్వరలోనే జనం ముందుకు రాబోతున్న ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ దీనంగా కూర్చున్నాడు. అతని వెనక గణపతి ఫోటో ఉంది. ఒక మునీశ్వరుడుతో పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి బొమ్మలు ఉన్నాయి. ”ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా?” అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని ఈ సినిమాను తీస్తున్నామని నిర్మాతలు యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల చెబుతున్నారు. అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రవి నిడమర్తి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version