కథలతో కమ్మేసే శేఖర్ కమ్ముల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 4న శేఖర్ కమ్ముల పుట్టినరోజు)
దర్శకుడు శేఖర్ కమ్ములను చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన కదలికలు చూస్తే కొండొకచో నవ్వులూ పూస్తాయి. ఇప్పటి దాకా శేఖర్ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా, ఆయన ఆకట్టున తీరు ఎక్కువే అనిపిస్తుంది. తాను రాసుకొనే కథల్లో సగటు ప్రేక్షకునికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసి మరీ వాటిని సినిమాలో చొప్పిస్తారు.
కాఫీ తాగని వారిచేత కూడా తన సినిమాల ద్వారా ‘మంచి కాఫీ తాగిన ఫీలింగ్’ కలిగిస్తూ ఉంటారు శేఖర్.
శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించారు. అయితే పెరిగి పెద్దయి, చదువుసంధ్యలు సూర్తి చేసుకున్నదంతా హైదరాబాద్ లోనే. అందువల్లే అతని మాటల్లో హైదరాబాద్ తెలుగు తకధిమితై అంటూ నాట్యం చేస్తూ ఉంటుంది. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రం రూపొందించి, అందరినీ తనవైపు తిప్పుకున్నారు శేఖర్. ఈ సినిమాతో ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా జాతీయ స్థాయిలో అవార్డు సంపాదించారు. ఆ తరువాత ఆనంద్తో జనానికి చేరువయ్యారు. గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ ఇలా తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగారు శేఖర్.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
నవతరం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే కథాంశాలతో శేఖర్ కమ్ముల చిత్రాలు ఉంటాయి. మన చుట్టూ, నిత్యం మనకు తారసపడే అంశాలతోనే శేఖర్ తన సినిమాలకు కథలు రూపొందిస్తూ ఉంటారు. అందుకే చూసేవారిని ఆయన కథలు ఇట్టే పట్టేస్తాయి. శేఖర్ ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ బాగా ఉంటుంది. అయినా, తన ప్రతి చిత్రంతో జనాన్ని ఆకర్షిస్తూ ఉండడమే శేఖర్ స్పెషాలిటీ. ప్రస్తుతం అందరు దర్శకుల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. శేఖర్ కథల్లో యువతను ఆకర్షించే అంశాలు బోలెడు ఉంటాయి. అలాగని అతను ఏ నాడూ అశ్లీలానికి, అసభ్యతకు తావిచ్చింది లేదు. శేఖర్ సినిమాలను నిరభ్యంతరంగా సకుటుంబసమేతంగా చూడవచ్చునని ప్రేక్షకుల విశ్వాసం. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూనే శేఖర్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన చిత్రాల్లో సహజత్వానికీ పెద్ద పీట వేస్తూంటారు. అలాగని ఆయన సినిమాల్లో పాటలు గట్రా ఉండవనీ కాదు. ఆ పాటల్లోనూ జనానికి సహజత్వం కనిపించేలా జాగ్రత్త పడతారు. అదే శేఖర్ ను నేటి దర్శకుల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది. లవ్ స్టోరీతో పర్లేదు అనిపించుకున్న శేఖర్ తరువాత ఏ సినిమాతో జనం ముందుకు వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!