NTV Telugu Site icon

Hanuman: రెండు రోజుల్లో పది లక్షల టికెట్స్ సోల్డ్ అవుట్…

Hanuman

Hanuman

హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ పెట్టిన ఎఫర్ట్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జట్ లో క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రేట్ కంటెంట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. హిందీలో 10 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ కి సొంతం చేసుకునేలా ఉన్న హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోనుంది. 1 మిలియన్ డాలర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రీచ్ అయిన హనుమాన్ మూవీ ఓవర్సీస్ లో టార్గెట్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఇదే జోష్ అన్ని సెంటర్స్ లో చూపిస్తూ ఉండడంతో హనుమాన్ సినిమాకి థియేటర్స్ పెరుగుతున్నాయి. అయితే ఇండియా మొత్తం జెండా ఎగరేస్తున్న హనుమాన్ సినిమా, తెలుగులో మాత్రం సరైన థియేటర్స్ లేక ఇబ్బంది పడడం బాధాకరం.

హనుమాన్ సినిమాకి మొదటి నుంచి నైజాంలో ఇష్యూ అవుతూనే ఉంది. హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా హనుమాన్ సినిమాకి ఈ ఇబ్బందులు తప్పట్లేదు. మెయిన్ సెంటర్ అయిన హైదరాబాద్ సిటీలో హనుమాన్ సినిమాకి మేజర్ సెంటర్స్ లోనే థియేటర్స్ లేకపోవడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తోంది. హైదరాబాద్ సిటీలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే హనుమాన్ సినిమా ఉండడంతో ఆడియన్స్ టికెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాకి కంప్లీట్ గా అనుకున్నన్ని థియేటర్స్ దొరికితే బాక్సాఫీస్ లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఈ థియేటర్స్ ఇష్యూ సంక్రాంతి సీజన్ అయిపోయే వరకూ ఉంటుంది కాబట్టి పోస్ట్ సంక్రాంతి హనుమాన్ సినిమా లాంగ్ రన్ ని మైంటైన్ చేయడం గ్యారెంటీ.