Site icon NTV Telugu

HanuMan North Response: ‘నార్త్’లో రచ్చ రేపుతున్న హనుమాన్.. రికార్డ్ బ్రేక్?

Hanuman

Hanuman

HanuMan getting Huge Response in North: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం హనుమాన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలో నటించారు. మొదటి ప్రీమియర్ షో నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా అట్రాక్ట్ అవుతోంది. ఈ విషయాన్ని సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ సినిమా నాన్ హాలిడే రిలీజ్ అని ప్రేక్షకులను థియేటర్ల వరకు లాక్కొచ్చే స్టార్ పవర్ ఏమీ లేదని ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేయలేదు కానీ హనుమాన్ కి ఒక మంచి శుభారంభం దొరికింది అని చెప్పుకొచ్చారు.

Hanu Man Collections: మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాకి డబుల్!

చాలా సౌత్ నుంచి హిందీకి వచ్చిన డబ్బింగ్ సినిమాలు 2023వ సంవత్సరంలో సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక ఇబ్బంది పడిన నేపథ్యంలో హనుమాన్ సినిమా మాత్రం పాజిటివ్ నోట్లో మొదలైందని మౌత్ టాక్ వల్ల ఇంకా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని చెప్పుకొచ్చారు. హనుమాన్ ఫ్రైడే ఒక్కరోజే హిందీలో రెండు కోట్ల 15 లక్షల వరకు కలెక్ట్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. హిందీ డబ్బింగ్ కూడా బాగా హిందీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది అని పేర్కొన్న ఆయన నార్త్ లో రిలీజ్ అయిన తెలుగు వర్షన్ ఒక్కదానికే ఫ్రైడే ఒక్కరోజు 24 లక్షలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇక ఇదే విషయం తేజ సజ్జా కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన సినిమాలకు గత ఏడాదిలో లేనంత మంచి ఓపెనింగ్స్ తమ సినిమాకు వచ్చాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెప్పారని పేర్లు చెప్పలేను కానీ గత ఏడాది నుంచి అన్ని సినిమాలతో పోలిస్తే తమ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version