Hanuman Director Prashanth Varma Responds on Theaters Issue: గుంటూరు కారం హనుమాన్ సినిమాల ప్రదర్శన విషయంలో థియేటర్ల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చి గుంటూరు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న అంశం మీద ప్రశాంత్ వర్మ స్పందించారు. గతంలోనే సినిమా ఎందుకు వాయిదా వేసుకోలేక పోయాం అనే విషయం మీద క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ మరోసారి ఈ థియేటర్ ల వివాదం మీద స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ నేను డైరెక్టర్ ను మాత్రమే, నా పూర్తి కాన్సన్ట్రేషన్ ఒక మంచి క్వాలిటీ సినిమా చేయడం మాత్రమే ఉంటుంది. థియేటర్ల విషయం మొదలు మిగతా అన్ని విషయాలు నిర్మాతలు చూసుకోవాల్సిందే. అయితే ఒక్కొక్కసారి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది, అందుకే నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. కానీ లేదంటే కనుక నేను ఒకసారి సినిమా చేసిన తర్వాత ఆ సినిమాతో ఇక అటాచ్మెంట్ పెంచుకొని ఇంకేదో చేసేయాలి అని ఏమాత్రం ఉండదు.
Venkatesh: ‘రానా నాయుడు’ నెగిటివ్ టాక్ పై వెంకీ మామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కానీ ఈ సినిమా స్పెషల్, నా ఒక్కడికోసమే ఇది సక్సెస్ అవ్వాలని కాదు ఇది కనుక సక్సెస్ అయితే మరొక 10 ఏళ్ల పాటు అందరూ గర్వంగా చెప్పుకునే మరో పది సినిమాలు చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వివాదాల గురించి కాకుండా సినిమా కంటెంట్ గురించి మాట్లాడుకుంటారని అన్నారు. అలాగే తప్పు జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడం చాలా పెద్ద తప్పు అని అందుకే తాను థియేటర్ల అంశం గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. అయితే మా పేర్లు వాడుకుని ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారని టాక్ నడుస్తుంది కదా అంటే అసలు మేము ఎవరి పేర్లు వాడడం లేదని కనీసం ఎవరు ఇదంతా చేస్తున్నారనే విషయం మీద కూడా మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ గురించి మాత్రమే ప్రేక్షకులందరూ ఆలోచిస్తారని ఆయన అన్నారు.
