Site icon NTV Telugu

Hansraj Raghuvanshi Wedding: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సింగర్

Hansraj Raghuvanshi Wedding

Hansraj Raghuvanshi Wedding

Hansraj Raghuvanshi Wedding: సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు నిశ్చితార్థం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. ఇటీవలే నటి పరిణీతి చోప్రా వివాహం జరగగా ఇప్పుడు సుప్రసిద్ధ సింగర్ హన్సరాజ్ రఘువంశీ కూడా తన స్నేహితురాలితో కలిసి ఏడు అడుగులు వేశారు. ‘మేరా భోలా హై భండారీ’ సాంగ్ ఫేమ్ హన్సరాజ్ రఘువంశీ తన చిరకాల స్నేహితురాలు కోమల్ సక్లానీని రహస్యంగా వివాహం చేసుకున్నాడు . ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసి సింగర్ స్వయంగా ఈ సమాచారాన్ని అందించాడు. ఇక రఘువంశీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వివాహ వీడియోలు మరియు ఫోటోలను పంచుకున్నారు. ఈ సంవత్సరం, మార్చి 25, 2023న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు, ఇక ఇప్పుడు ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లోయలలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు .

ఆదివారం టు శనివారం.. అన్ని వారాల టైటిల్స్ అబ్జర్వ్ చేశారా?

హన్స్‌రాజ్ రఘువంశీ వివాహానికి ప్రపంచ ఛాంపియన్ పవర్‌లిఫ్టర్ మహంత్ గౌరవ్ శర్మ కూడా హాజరయ్యారు. హన్సరాజ్ రఘువంశీ హిమాచల్‌లోని సర్కాఘాట్‌లో ఏడు అడుగులు వేశారని అంటున్నారు. ఇక వివాహ సమయంలో హన్స్‌రాజ్ గోల్డెన్ కలర్ షేర్వానీలో కనిపిస్తుండగా, వధువు కోమల్ హెవీ రెడ్ కలర్ లెహంగాలో హిమాచలీ వధువులా కనిపించింది. 2017 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. హన్సరాజ్ రఘువంశీ కెరీర్ గురించి చెప్పాలంటే ఆయన పాడిన ‘మేరా భోలా హై భండారీ’ 2019లో సంవత్సరంలో చాలా వైరల్ అయ్యింది. ఆ తరువాత ఆయన పార్వతి బోలి శంకర్ వంటి అనేక పాటలు పాడారు. సింగర్ హన్సరాజ్ రఘువంశీ ‘పాల్ పల్ దిల్ కే పాస్’తో బాలీవుడ్‌లో గాయకుడిగా అరంగేట్రం చేశారు. ఇటీవల హన్సరాజ్ OMG 2 చిత్రంలోని ఉండి ఉండి వాడి అనే పాటను పాడారు. ఇక సింగర్ హన్సరాజ్ రఘువంశీ భార్య ఒక యూట్యూబర్.

Exit mobile version