ప్రస్తుతం సెలబ్రెటీలు ఎంత తర్వాగా వివాహం చేసుకుంటున్నారో, అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. నిత్యం ఎవరో ఒకరి గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నయనతార – విఘ్నేష్ శివన్, సంగీత – క్రిష్, గోవింద – సునీత అహుజాలు విడాకులు తీసుకోబోతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దశలో స్టార్ హీరోయిన్ హన్సిక పైరు కూడా కొంతకాలంగా గట్టిగా వినపడుతుంది. అలాంటిదేమీ లేదని హన్సిక భర్త సొయైల్ కతూరియా చెబుతున్నప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్సిక వీటిని బీజం పోసింది..
Also Read : SSMB 29: అరగంటకు రెండు కోట్ల సెట్ వృధా..
వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలబ్రెటిలు అంత కుటుంభంతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే హన్సికా కూడా వినాయకుడిని స్వయంగా ఇంటికి తీసుకువచ్చి, ఇంటిని అందంగా డెకరేట్ చేసి, పూజలు నిర్వహించింది. ఈ ఫోటోలను షేర్ చేసిన తరువాత, అభిమానులు, మీడియాలో కాసేపే హాట్ టాపిక్‌గా మారాయి. విశేషం ఏమంటే.. భర్త సొహైల్ లేదా ఇతర కుటుంబ సభ్యులు అందులో ఉండకపోవడం, అలాగే మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా హన్సికా దర్శనమిచ్చింది. సాధారణంగా హిందూ స్త్రీలు, సెలబ్రిటీలు పండుగల్లో ఇలా ఉండరు. అందువల్ల, మీడియా వర్గాలు ఆమెను భర్త నుండి దూరమైనట్లు, విడాకులపై హింట్ ఇచ్చినట్టు అర్థం చేసుకున్నారు.ఇప్పటికే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఈ ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై హన్సికా ఏ విధంగా స్పందిస్తారో, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
