Site icon NTV Telugu

Hansika : ఆ సమయంలో వారు నన్ను అవమానించారు..

Whatsapp Image 2023 06 11 At 9.39.58 Pm

Whatsapp Image 2023 06 11 At 9.39.58 Pm

యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక కు ప్రేక్షకుల్లో క్రేజ్ మాములుగా లేదు.హన్సిక ను అభిమానించే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమా లో ప్రత్యేక పాత్ర లో కూడా నటించింది.తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడాని కి కూడా డిజైనర్లు పెద్దగా ఆసక్తి ని చూపేవారు కాదని హన్సిక అన్నారు.

మీరు సౌత్ హీరోయినా అంటూ చులకనగా మాపై కామెంట్లు చేసేవారని హన్సిక చెప్పుకొచ్చారు. కొంతమంది డిజైనర్లు మాకు దుస్తులు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేవాళ్లు అని హన్సిక కామెంట్స్ చేసింది.కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారి పోయాయని హన్సిక చెప్పుకొచ్చింది మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని ఇప్పుడు వాళ్లు తెగ బ్రతిమాలుతున్నారని హన్సిక చెప్పుకొచ్చారు. ఏదైనా ఈవెంట్ ఉంటే కనుక వారంతట వారే వచ్చి వాళ్లు వచ్చి ఈ డ్రెస్ వేసుకోవాలని అడుగుతున్నారని హన్సిక పేర్కొన్నారు. డిజైనర్లు అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎంతో తేడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.. గతంలో వాళ్లు అలా మాట్లాడిన సమయంలో నేను ద్వేషం పెంచుకోలేదని హన్సిక చెప్పుకొచ్చారు.ఆ నెగిటివ్ కామెంట్లకు నాకు బాధ పడలేదని మరింత గా కష్టపడాలని నాకు అర్థమైందని పేర్కొన్నారు. నా హార్డ్ వర్క్ తో ఆ డిజైనర్లను తిరిగి రప్పించాలని ఎంతో కసితో పని చేశానని హన్సిక తెలిపింది.. ఛీ కొట్టిన వాళ్లే మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావడంతో నాకు ఆశ్చర్యం వేసేదని ఆమె అన్నారు. వాళ్లు నా దగ్గరకు వచ్చిన సమయంలో ఒక సెకన్ ఆలోచించి మరీ ఓకే చెప్పేదానినని హన్సిక చెప్పుకొచ్చారు.హన్సిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది

Exit mobile version