Hansika: దేశముదురు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హన్సిక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నదని సమాచారం. సినిమాలతో పాటు వివాదాలతో కూడా స్నేహం చేసే హన్సిక ఇటీవలే కొన్ని అనుకోని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే హన్సిక వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నదట. ఇప్పటికే కుటుంబ సభ్యుల అంగీకారంతో కోరుకున్న ప్రియుడినే హన్సిక వివాహమాడబోతుందని టాక్. ఇక ఈ పెళ్లి.. డిసెంబర్ లో జైపూర్ కోటలో జరగనున్నదని సమాచారం.
రాయల్ వెడ్డింగ్ లా హన్సిక పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసేసారట.. ఈ క్రమంలోనే జైపూర్ లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ ను హన్సిక కుటుంబ సభ్యులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్ళికి సంబంధించిన పనులను మొదలు కూడా పెట్టేశారట. అయితే హన్సిక కోరుకున్న ప్రియుడు ఎవరు అనేది ఇప్పుడప్పుడే బయటపెట్టరట.. పెళ్ళికి కొద్దిరోజుల ముందు ఈ భామ తనకు కాబోయే భర్తను పరిచయం చేయనుందని సమాచారం. ఏదిఏమైనా హన్సిక తన జీవితంలో కొత్త అంకాన్నికి నాంది పలుకుతుంది అన్నమాట.. మరి పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటిస్తుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.