నటి హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయాలో నటించి మెప్పించింది. ఆ తరువాత హీరోయిన్ గా మారి ఎన్నో మంచి విజయాలు అందుకుంది హన్సిక.తన సినీ కెరియర్లో దాదాపు 50 సినిమాలలో నటించి మెప్పించింది.ఈమె గత సంవత్సరం పెళ్లి చేసుకుంది..ఈ విధంగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన హన్సిక ఒకవైపు వ్యక్తిగత జీవితంలోను మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈమె వరుసగా హిందీ సినిమాలకు కమిట్ అవుతూ చాలా బిజీగా ఉన్నారు. ఇక తమిళంలో ఈమె హీరో ఆది పినిశెట్టితో కలిసి నటించిన పార్ట్నర్ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అయింది..
ఈ సినిమా విడుదల సందర్బంగా మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నై వచ్చి మీడియా సమావేశంలో పాల్గొనింది హన్సిక.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు. పార్ట్నర్ సినిమాలో తాను విభిన్న పాత్రలో నటించినట్లు ఆమె తెలిపింది.. ఇందులో తాను పురుషుడిగా మారే పాత్రలో కనిపిస్తానని ఆమె తెలియజేశారు. అయితే కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.ఇక ఈ సినిమాలో ఈమె పురుషుడిగా మారే పాత్రలో నటించాను అని చెప్పడంతో నిజజీవితంలో అలాంటి అవకాశం ఉంటే మీరు ఎవరిలా మారతారు అన్న ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీంతో ఈమె తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగా మారిపోతాను అంటూ కామెంట్ చేసింది హన్సిక.నిర్మాత గా మారే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అంటూ ప్రశ్నించడంతో తనకు నటిగా నటించడమే ఇష్టమని నటన పరంగా నాకు కొన్ని కలలు వున్నాయి అని అందరి చేత ఒక మంచి మనిషి అనిపించుకుంటే చాలని అంతకుమించి తనకు వేరే ఆలోచనలు అస్సలు లేవని హన్సిక తెలిపారు. ఇండస్ట్రీలో నేను నటిగా మాత్రమే కొనసాగుతాను ఇతర రంగాల వైపు అస్సలు వెళ్ళను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
