NTV Telugu Site icon

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ టార్చర్ పెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

Hansika

Hansika

Hansika: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ పూలబాటలో నడవాలంటే.. ముందుగా ముళ్ల దారిని దాటాల్సి ఉంటుంది. అవమానాలు,ఛీత్కారాలు, వేధింపులు.. ఇవన్నీ దైర్యంగా నిలబడి దాటినవారే.. స్టార్ గా గుర్తింపుతెచ్చుకొని పూలబాటలో నడవగలుగుతారు. ముఖ్యంగా ఈ రంగంలో హీరోయిన్లుగా ఎదగడం చాలా కష్టం. ఇక ఎదిగే క్రమంలో వారు ఎన్నో వేధింపులను ఎదుర్కుంటారు. కొంతమంది ఆ వేధింపులను బయటికి చెప్పరు. ఇంకొంతమంది నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పుకొస్తారు. తాజాగా బబ్లీ బ్యూటీ హన్సిక తనను ఒక హీరో వేధించాడని చెప్పుకొచ్చింది. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేసింది. ఇక ఈ సినిమా తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హన్సిక.. గతేడాది ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

Malladi: ‘కువారి బహు’ నుండి ‘8 ఎ. ఎం. మెట్రో’ వరకూ!

ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో తాను కూడా మీటూ బాధితురాలినే అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ మొదట్లో తాను కూడా వేధింపులు, అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ” నేను కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు డిజైనర్ డ్రెస్ లు వేసుకోవాలని ఆశపడ్డాను. డిజైనర్స్ దగ్గరకు వెళ్లి.. నాకు నచ్చిన డ్రెస్ లను డిజైన్ చేస్తారా అని అడిగితే.. వారు ముఖం మీదనే కుదరదు అని చెప్పేసేవారు. అలా ఎందుకు చెప్పేవారో నాకు ఆ సమయంలో అర్ధం కాలేదు. ఆ తరువాత తరువాత నిదానంగా అర్ధం అయ్యింది. మనసులో దురుద్దేశ్యంతోనే వారు డ్రెస్ లు డిజైన్ చేయలేదని తెలిసింది. అంతేకాకుండా.. ఒక స్టార్ హీరో.. నన్ను చాలా టార్చర్ పెట్టాడు. డేట్ కు వస్తావా అంటూ వేధించాడు. కానీ అతనికి తగిన రీతిలో బుద్ది చెప్పి పంపించాను” అని చెప్పుకొచ్చింది. అయితే హన్సికను టార్చర్ పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరా..? అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కెరీర్ మొదటినుంచి హన్సిక కుర్ర హీరోలతోనే జతకట్టింది. ఆ కుర్ర హీరోల్లో ఏ హీరో హన్సికను వేధించాడో తెలియాలి.

Show comments