NTV Telugu Site icon

Hansika: అప్పుడు శింబు.. ఇప్పుడు సోహెల్.. హన్సిక ప్రైవేట్ ఫోటోస్ లీక్

Hansika

Hansika

Hansika: దేశముదురు భామ హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం విదితమే. సోహెల్ ఖతురియా అనే బిజినెస్ మ్యాన్ ను ఈ అమ్మడు పెళ్లాడనుంది. ఇదివరకే సోహెల్ కు రింకీ అనే యువతితో పెళ్లి అయ్యింది. ఆ రింకీ ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం తెల్సిన దగ్గరనుంచి అమ్మడిని నెటిజన్లు ఆడేసుకుంటున్నాడు. ఎందుకు రెండో పెళ్లి వాడిని చేసుకుంటున్నావ్.. అవసరమా..? నీకు అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే హన్సిక, సోహెల్ ప్రైవేట్ ఫోటో ఒకటి నెట్టింట లీక్ అయ్యింది.

హన్సిక అఫీషియల్ అనే అకౌంట్ లో ఈ ఫోటో ను షేర్ చేశారు. చాలామంది అది హన్సిక అకౌంట్ అనే నమ్మి.. వారికి చీవాట్లు పెడుతున్నారు. పెళ్ళికి ముందే ఈ జంట ఇలా షికార్లు చేయబట్టే ఇప్పుడు పెళ్లివరకు వచ్చిందని, రింకీ ఉన్నప్పుడే వీరిద్దరూ కలిసి షికార్లు చేసారని పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక ఈ పోస్ట్ పై హన్సిక స్పందించింది. అది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. బాట్ లో కాబోయే భర్తతో షికార్లు చేస్తూ హన్సిక కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక గతంలోనూ ప్రియుడు శింబుతో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. అప్పట్లో అదో పెద్ద సంచలనాన్నే రేపింది.