NTV Telugu Site icon

Satya:ఏఎల్ విజయ్ మేనల్లుడు హీరోగా ప్రేమలు డైరెక్టర్ కూతురి సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్!

Satya Trailer

Satya Trailer

Hamaresh Prarthana Starrer Satya Trailer Launched: స్కూల్ ప్రేమకథగా ‘సత్య’ అనే సినిమా రాబోతుంది. గత ఏడాది తమిళ్ లో రిలీజ్ అయి హిట్ అయిన రంగోలి సినిమా ఇప్పుడు తెలుగులో సత్యగా రిలీజ్ కాబోతుంది. ఓ టెన్త్ క్లాస్ కుర్రాడి ప్రేమ కథగా సత్య సినిమా రాబోతుంది. డైరెక్టర్ ఏఎల్ విజయ్ మేనల్లుడు, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ హమరేష్ హీరోగా, ఈ మధ్య సూపర్ హిట్ కొట్టిన ప్రేమలు డైరెక్టర్ గిరీష్ అన్న సందీప్ కుమార్తె ప్రార్థన హీరోయిన్ గా, ఆడుకాలం మురుగ దాస్, అమిత్ భార్గవ్, సంజయ్ సహా పలువురు కొత్తవాళ్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో సత్య సినిమా తెరకెక్కగా సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

Lockdown: ఇదేంట్రా… అనుపమ మళ్ళీ లాక్ డౌన్ అంటోంది?

ఇక శివమ్ మీడియా నిర్మాణ సంస్థ నుంచి తొలి సినిమా సత్య ట్రెయిలర్ ఈరోజు 8 మంది దర్శకుల చేతుల మీదగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించగా ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు. ఈ క్రమ్మలో దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ తమిళ్ లో ఈ సినిమాని నేను రంగోలి గా తీసాను, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తుంది, అందరూ చూసి మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నానన్నారు. ప్రార్థన సందీప్ మాట్లాడుతూ : తమిళ్ లో సినిమా మంచి హిట్ అయ్యింది, ఈరోజు తెలుగులో మాకు శివ మల్లాల మంచి స్టేజ్ ఇచ్చారు. తెలుగులో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.