Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్

Irumudi

Irumudi

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి‘. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒకప్పటి ఐకానిక్ భక్తి గీతం “విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి  సాంగ్ రీమిక్స్ ఉండబోతున్నట్లు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కన్ఫర్మ్ చేసారు.

దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు అత్యంత ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి.. బంగారు పల్లకి” అనే పాటను రీమిక్స్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ పాట రీమిక్స్ గురించి ఫ్యాన్స్ నుండి భారీగా రిక్వెస్ట్‌లు వచ్చాయని వారి కోరిక మేరకు ఈ ఐకానిక్ ట్రాక్‌ను మరింత ఎనర్జిటిక్‌గా రీమిక్స్  చేస్తున్నారు. రవితేజ ఎనర్జీకి ఈ క్లాసిక్ సాంగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ‘ఇరుముడి’ చిత్రం కేవలం భక్తి నేపథ్యంలోనే కాకుండా బలమైన తండ్రీ-కూతుళ్ల ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపిస్తోంది. ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ధీమాగా ఉన్నారు.