Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి‘. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒకప్పటి ఐకానిక్ భక్తి గీతం “విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి“ సాంగ్ రీమిక్స్ ఉండబోతున్నట్లు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కన్ఫర్మ్ చేసారు.
దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు అత్యంత ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి.. బంగారు పల్లకి” అనే పాటను రీమిక్స్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ పాట రీమిక్స్ గురించి ఫ్యాన్స్ నుండి భారీగా రిక్వెస్ట్‌లు వచ్చాయని వారి కోరిక మేరకు ఈ ఐకానిక్ ట్రాక్‌ను మరింత ఎనర్జిటిక్‌గా రీమిక్స్ చేస్తున్నారు. రవితేజ ఎనర్జీకి ఈ క్లాసిక్ సాంగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ‘ఇరుముడి’ చిత్రం కేవలం భక్తి నేపథ్యంలోనే కాకుండా బలమైన తండ్రీ-కూతుళ్ల ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపిస్తోంది. ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ధీమాగా ఉన్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?