Site icon NTV Telugu

GV Prakash : ధనుష్‌ను మోసం చేయలేను – జీవీ ప్రకాష్

Danush

Danush

చాలా మంది నటులు పాత్రను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది పాత్రలో లోతుగా ఆలోచించి తిరస్కరిస్తారు. అలాగే, తమకు ఇష్టమైన నటులతో కలిసి పని చేయాలంటే మరింతగా ఆలోచిస్తారు. ఈ విషయంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా స్పష్టమైన వ్యక్తిత్వం చూపిస్తారు. వరుస సినిమాలకు సంగీతం అందిస్తున్న ప్రకాష్, తాజాగా తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హాజరై ధనుష్‌తో తన అనుబంధాన్ని వెల్లడించారు.

Also Read : Aparna Balamurali : ఎయిర్‌పోర్టులో జరిగిన అవమానం మార్చిపోలేను..

జీవీ ప్రకాష్ మాట్లాడుతూ, “రాయన్ సినిమాలో ధనుష్ తన తమ్ముడి పాత్రలో నటించమని అడిగాడు. కానీ ఆ పాత్ర ధనుష్‌ను మోసం చేసే విధమైనది. అందుకే నేను దాన్ని చేయకూడదని నిర్ణయించుకున్నాను. యాక్టింగ్ కోసమో సరే, ధనుష్‌ను మోసం చేయలేనని భావించాను” అని చెప్పారు. ఈ విషయంతో వారి మధ్య ఉన్న గొప్ప అనుబంధం స్పష్టమైంది. అదే ఈవెంట్‌లో ధనుష్ కూడా జీవీ ప్రకాష్ గురించి గొప్ప మాటలు చెప్పారు. “జీవీ కేవలం రీల్స్ లేదా ట్రెండ్స్ కోసం సంగీతం రాస్తారనని కాదు. ఆయ‌న తన పని మీద చాలా ప్యాషన్‌తో ఉంటారు. ఎన్నో సాంగ్స్, ఎంజామీ, ఎన్న సుగం లాంటి పాటలు ఆడియెన్స్ మ‌నసుల్లో పాతుకుపోయాయి. జీవీ లాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు యువ మ్యూజిక్ డైరెక్టర్లకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. వారిని పరిశ్రమలోకి తేవడంలో సహాయం చేస్తున్నారు” అని ధనుష్ అన్నారు. ఇక ఈ సినిమా నిత్య మీనన్ హీరోయిన్‌గా, షాలినీ పాండే, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించగా, డాన్ పిక్చర్స్ & వుండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తమిళంలో ఇడ్లీ క‌డైగా, తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అనే టైటిల్‌తో అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version