NTV Telugu Site icon

Krishna Mallidi : బేబీ మగజాతి ఆణిముత్యం.. ఆ డైరెక్టర్‌ తమ్ముడంట!

Baby Movie Vyshnavi Husband Krishna Mallidi

Baby Movie Vyshnavi Husband Krishna Mallidi

Guy who Married Vaishanavi in Baby is Brother of Director Vasishta: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన బేబీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆనంద దేవరకొండ విరాజ్ అశ్విన్లు హీరోలుగా నటించారు. గతంలో కొబ్బరిమట్ట, హృదయకాలేయం లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫొటో సినిమాని నిర్మించిన సాయి రాజేష్ ఈ బేబీ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ సినిమా చూసిన వారందరూ తమ తమ స్పందనను భిన్నంగా తెలియజేశారు కొంతమంది సినిమా బాగుందంటే కొంతమంది ఇదేం బాగుంది అంటూ పెదవి విరిచారు. అయితే కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 90 కోట్ల వరకు కలెక్షన్లు కాబట్టి హాట్ టాపిక్ అయింది.

IBomma: చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి.. ? అన్నట్టు.. నీకెందుకయ్యా ఈ సుద్దపూస కబుర్లు

అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇద్దరినీ కాకుండా వైష్ణవి చైతన్య ఒక మూడో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఆ వ్యక్తి కనిపించింది కేవలం ఒక్క షాట్ లోనే అయినా అతని మీద చాలా మంది తమ సానుభూతి వ్యక్తం చేశారు. ఏమీ తెలియక కొత్త పెళ్ళికొడుకు హ్యాపీగా ఉన్నాడు, వైష్ణవి చైతన్య గతం తెలిస్తే ఏమైపోతాడో అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు పెద్దగా చర్చ జరగలేదు, కానీ ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంకి అతనిని అతిథిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అతను ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలు తెలిసాయి. సదరు నటుడి పేరు మల్లిడి కృష్ణ, ఇప్పటికే అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.


సాయి రాజేష్ నిర్మాణంలో తెరెక్కిన కలర్ ఫొటో సినిమాలో హీరోకి సీనియర్ గా కూడా కనిపిస్తాడు. ఎన్నో సినిమాలు చేసినా మనోడికి బ్రేక్ రాలేదు, కానీ కేవలం ఒకే ఒక్క షాట్ లో కనిపించిన బేబీ సినిమాతో గుర్తింపు దక్కింది. అసలు విషయం ఏమిటంటే ఈ కృష్ణ మరెవరో కాదు బింబిసారా లాంటి సినిమాతో హిట్టు కొట్టిన వశిష్ఠకి సోదరుడట. వశిష్ట తండ్రి గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలా సినీ కుటుంబం నుంచి కృష్ణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో హాట్ యాంకర్ విష్ణుప్రియ ఆమె సోదరితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం కూడా చర్చనీయాంశం అయింది. కొంతమంది వారు స్నేహితులు అంటుంటే మరి కొంతమంది బంధువులు అంటూ కామెంట్ చేస్తున్నారు.