యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ సత్యదేవ్ తనకు జీవితంలో ఎదురైన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు. చిన్నతనం నుండి యంగ్ ఏజ్ వరకు హీరో జీవితంలోని అందమైన, భావోద్వేగ క్షణాలతో ట్రైలర్ లోడ్ సెహెశారు మేకర్స్.
Read Also : Breakup : భర్తకు బైబై చెప్పేసిన కాంట్రవర్సీ బ్యూటీ
“గుర్తుందా శీతాకాలం” కన్నడ చిత్రం ‘లవ్ మాక్‌టెయిల్’కి రీమేక్. అసలు చిత్రంలో డార్లింగ్ కృష్ణ, మిలనా నాగరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక “గుర్తుందా శీతాకాలం” విషయానికొస్తే మేఘా ఆకాష్, కావ్య శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే సీజన్ ఆఫ్ మ్యాజిక్, మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం అన్పించక మానదు.
