Site icon NTV Telugu

Guntur Kaaram: మీరు సినిమా మొత్తం వార్నింగ్ బోర్డ్ వేసుకోండి… రికార్డులు మేము చూసుకుంటాం

Ssmb 28 Guntur Kaaram

Ssmb 28 Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైలీ ఆంటిసిపేటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. జనవరి 12ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేస్తోంది. ఇన్ని రోజులు మహేష్ ఫ్యాన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నింటినీ గుంటూరు కారం సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఇచ్చేస్తోంది. మాస్ స్ట్రైక్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్, బర్త్ డే పోస్టర్… లేటెస్ట్ గా టైటిల్ సాంగ్… ఇలా గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉంది. అయితే వీటన్నింటిలో ఉన్న కామన్ పాయింట్… మహేష్ చేతిలో ఉన్న బీడీ.

ఒకప్పుడు మహేష్ బాబు చైన్ స్మోకర్, ఆ తర్వాత స్మోకింగ్ కంప్లీట్ గా ఆపేసాడు. తెరపై ఒక సీన్ కోసం కూడా మహేష్ సిగరెట్ తాగుతూ కనిపించలేదు. నిజానికి మహేష్ స్మోకింగ్ స్టైల్ ఫ్యాన్స్ కి సెపరేట్ కిక్ ఇస్తుంది. ఇన్ని రోజులు మిస్సైన ఆ కిక్ ని గుంటూరు కారం సినిమా ఇస్తోంది. టిల్ డేట్ రిలీజ్ డేట్ చేసిన అన్ని ప్రమోషల్ కంటెంట్ లో బీడీ ఉంది కాబట్టి సినిమాకి ఆల్మోస్ట్ 80% వరకూ “ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అనే స్టేషనరీ వార్నింగ్ కనిపించనుంది. ఎన్ని వార్నింగ్ బోర్డ్స్ కనిపిస్తే ఏంటి మహేష్ బీడీతో కనిపిస్తే చాలు… ఆ సీన్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. సింపుల్ గా చెప్పాలి అంటే సెన్సార్ వాళ్లు నో స్మోకింగ్ వార్నింగ్ సినిమా మొత్తం వేస్తారు, మహేష్ ఫ్యాన్స్ సినిమాతో అన్ని రికార్డులని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి జనవరి 12న గుంటూరు కారం ఘాటు తెలుగు రాష్ట్రాలకి ఏ రేంజులో తగులుతుందో చూడాలి.

Exit mobile version