Site icon NTV Telugu

Guntur Kaaram: రాజమౌళి సినిమా కాదు కానీ… రికార్డులు మాత్రం ఆ రేంజులోనే లేస్తాయ్

Guntur Kaaram

Guntur Kaaram

దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళిపోతారు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తీసుకోని రావడం రాజమౌళి రాజముద్రకే సాధ్యం. రాజమౌళి తర్వాత కేవలం తన పేరుతోనే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకోని రాగాల స్టామినా ఉన్నది మహేష్ బాబుకే. ఈ సూపర్ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా లేక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా అనేది చూడకుండా కేవలం మహేష్ సినిమాగానే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. రాజమౌళితో ఒక్క సినిమా చేయకున్నా కూడా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అంటే మహేష్ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఏ రేంజులో ఫుల్ చేస్తున్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పరశురామ్, అనీల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి డైరెక్టర్స్ తోనే రీజనల్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టిన మహేష్ బాబు, ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసాడు.

ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో జనవరి 12న తెలియనుంది. గుంటూరు కారం మాస్ సినిమానా క్లాస్ సినిమానా… మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానా పక్కా కమర్షియల్ సినిమానా అనే విషయాలు పక్కన పెడితే… ఇది మహేష్ బాబు సినిమా, పైగా పండక్కి వస్తున్న సినిమా… టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకూ ఏ సినిమా రాబట్టనంత రేంజులోనే ఉంటాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాపై ఉన్న హైప్ ని సాంగ్స్, ట్రైలర్ మరింత పెంచితే మాత్రం ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పినట్లు… ఇది రాజమౌళి సినిమా కాదు కానీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజులోనే ఉంటాయి.

Exit mobile version