NTV Telugu Site icon

Guntur Kaaram: 2.5 మిలియన్ డాలర్స్… టాక్ తో సార్ కి సంబంధమే లేదు

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరువలో ఉంది. ఈరోజు ఫెస్టివల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంది. మరో 30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తేనే గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లు. మాములుగా అయితే మహేష్ సినిమాకి ఇది పెద్ద కష్టమేమి కాదు కానీ హనుమాన్ ఎఫెక్ట్ గుంటూరు కారం సినిమాపై చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంటుందా అనే డౌట్ రైజ్ అవుతోంది.

ఇంత నెగటివ్ టాక్ తో కూడా మహేష్ బాబు బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయితే మాత్రం ఘట్టమనేని అభిమానులు అద్భుతం చేసినట్లే. వేరే సినిమాలైతే ఇంత నెగటివ్ టాక్ వస్తే మొదటి రోజు ఈవెనింగ్ షోస్ కే థియేటర్స్ కాలీ అయిపోతాయి. మహేష్ చరిష్మా, ఘట్టమనేని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టే పనిలో ఉన్నారు. ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం సినిమా బాగానే కలెక్ట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమా 2.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. ఫ్లాప్ టాక్ తో 2.5 మిళియన్ డాలర్స్ రాబట్టాడు అంటే మహేష్ కి హిట్ టాక్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేది.

Show comments