Site icon NTV Telugu

Guntur Kaaram: డే 2 కలెక్షన్స్… రెండు రోజుల్లో 50% బ్రేక్ ఈవెన్ టార్గెట్ రికవరీ

Guntur Kaaramm

Guntur Kaaramm

గుంటూరు కారం… మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేసిన మహేష్ అండ్ త్రివిక్రమ్ ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చారు. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టింది. మహేష్ బాబుని ఇప్పటివరకూ చూడనంత గ్లామర్ గా, సూపర్ డాన్స్ తో, మంచి ఎనర్జితో చూపించాడు త్రివిక్రమ్. పండగ సీజన్ కంప్లీట్ అయ్యాక గుంటూరు కారం ఎలా నిలబడుతుంది అనే దానిపైనే ఈ మూవీ రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పటికైతే దుమ్ములేచే కలెక్షన్స్ తో గుంటూరు కారం సినిమా దూసుకోని పోతుంది.

డే 1 అన్ని సెంటర్స్ కలిపి 94 కోట్లు రాబట్టిన గుంటూరు కారం సినిమా, డే 2 కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. డే 2 గుంటూరు కారం సినిమా 33 కోట్లని కలెక్ట్ చేయడంతో టోటల్ కలెక్షన్స్ 127 కోట్లకు చేరుకున్నాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో కలిపి గుంటూరు కారం 127 కోట్లని కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫీషయల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 135 కోట్లు కాగా… అందులో 66 కోట్లని రెండు రోజుల్లోనే కలెక్ట్ చేయడంతో గుంటూరు కారం 50% పైనే బిజినెస్ రికవరీ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే డే 2 కన్నా డే 3 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి గుంటూరు కారం సినిమా డే 3 కూడా 15-20 కోట్లు రాబడితే మంచి ఫిగర్స్ ని పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. డే 4 ఎలాగూ సంక్రాంతి కాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాబు ర్యాంపేజ్ ఉంటుంది. సో ఎటు చూసినా గుంటూరు కారం సినిమా కనుమ పండగ ముగిసే సమయానికి తక్కువలో తక్కువ 70-75% బిజినెస్ రికవరీ చేసేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

Exit mobile version