Site icon NTV Telugu

Guntur Kaaram: 1.4 మిలియన్ డాలర్స్… ఓవర్సీస్ లో రమణగాడి ర్యాంపేజ్…

Mahesh Babu Guntur Kaaram

Mahesh Babu Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మామూలుగానే ఓవర్సీస్ లో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడతాయి. అలాంటిది కెరీర్ బెస్ట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇస్తే సైలెంట్ గా ఉంటాడా? రికార్డులు లేపుతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాడు. చాలా కాలంగా ఓవర్సీస్ ని మరీ ముఖ్యంగా యుఎస్ మార్కెట్ ని తన హోమ్ గ్రౌండ్ గా మార్చుకున్న మహేష్ బాబు… అత్యధిక సార్లు వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సినిమాలు కలిగున్నాడు. నార్త్ అమెరికాలో మహేష్ చాలా స్ట్రాంగ్ అనే విషయాన్ని గుంటూరు కారం సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది.

Read Also: Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…

ప్రీమియర్స్ తోనే గుంటూరు కారం సినిమా 1.4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఇది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇన్ యుఎస్. ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే లోపు మహేష్ బాబు 2 మిలియన్ డాలర్స్ ని టచ్ చేస్తాడేమో చూడాలి. ఇదే జరిగితే గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి మండేకి యుఎస్ మార్కెట్ లో సెన్సేషనల్ ఫిగర్ ని సెట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గుంటూరు కారం సినిమా రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఒక రీజనల్ సినిమా ముందెన్నడూ చూడని ఓపెనింగ్ డే ఫిగర్స్ ని రాబట్టనుంది.

Read Also: Captain Miller: సోషల్ మీడియాలో మిల్లర్ టాక్ మాములుగా లేదుగా…

Exit mobile version