Site icon NTV Telugu

Guntur Kaaram: హ్యాట్రిక్ 2 మిలియన్ డాలర్ మూవీస్…

Guntur Kaaram

Guntur Kaaram

టాక్ బాగోలేకుంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుందేమో కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం… టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం మహేష్ సినిమాల స్టైల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకి సూపర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. దీని కారణంగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా వచ్చినా అది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర మరీ ముఖ్యంగా యుఎస్ బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… సినిమాలతో యుఎస్ రీజన్ లో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన మహేష్ బాబు లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో రెండు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని టచ్ చేసాడు.

2 మిలియన్ మార్క్ ని గుంటూరు కారం రెచ్చ్ అవ్వడం కంప్లీట్ గా మహేష్ బాబు క్రెడిట్ అనే చెప్పాలి. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట సినిమాల తర్వాత మహేష్ గుంటూరు కారం సినిమాతో హ్యాట్రిక్ 2 మిలియన్ డాలర్స్ మూవీస్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా టాక్ బాగోలేదు, యావరేజ్ ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈరోజు సండే కాబట్టి ఈరోజు కూడా కలెక్షన్స్ రాక్ సాలిడ్ గా ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత గుంటూరు కారం సినిమా ఎలా నిలబడుతుంది అనే దానిపైనే లాంగ్ రన్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి కానీ ఇప్పటికైతే మరో రెండు మూడు రోజుల పాటు గుంటూరు కారం సినిమా స్ట్రాంగ్ గానే ఉంటుంది.

Exit mobile version