Guntur kaaram 7th Lyrical is Releasing now after OTT Streaming: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించ లేక పోయింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా సంక్రాంతి బరిలో చిన్న సినిమాతో పోటీ పడి రేసులో వెనక పడింది. ఈ సినిమా ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన ఏడవ పాట త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
Akkineni Nagarjuna: నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
దాదాపు సినిమా ధియేటర్లలో రిలీజ్ అయి బిఎత్రికల్ పూర్తయిన తర్వాత ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. బహుశా టాలీవుడ్ లో ఇలా సినిమా రిలీజ్ అయిన అనంతరం పాట రిలీజ్ కావడం ఇదే మొదటిది కావచ్చని అంటున్నారు. ఈ శుక్రవారం గుంటూరు కారం ఏడో లిరికల్ సాంగ్ వస్తుంది అంటూ స్వయంగా తమన్ ప్రకటించారు. అక్కడితో ఆగలేదు సరికదా ఈ పాట తనకు, మహేష్ బాబుకు ది బెస్ట్ సాంగ్ అని కూడా చెప్పుకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత లిరికల్ సాంగ్ ఏంట్రా బాబూ అనే కామెంట్స్ పడుతున్నాయి. అంత బెస్ట్ సాంగ్ అనుకున్నప్పుడు సినిమాలో ఎందుకు పెట్టలేదని? కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం దానికి కూడా బ్రేక్ ఇద్దాం పోయేదేముంది అంటూ కామెంట్ చేస్తున్నారు.