Site icon NTV Telugu

Justin Bieber : కాన్సర్ట్ లో కాల్పుల కలకలం… గాయాలు

Justin-Biber

పాపులర్ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కాన్సర్ట్ బయట కాల్పుల కలకలం రేగింది. ఫిబ్రవరి 11, శుక్రవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో సెలబ్రిటీ ప్యాక్ పార్టీ వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ది నైస్ గై అనే రెస్టారెంట్ బయట కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగడంతో గన్ ఫైర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు. కానీ బుల్లెట్లు తగిలి రాపర్ కోడాక్ బ్లాక్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు సమాచారం. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ

రాపర్ కొడాక్ బ్లాక్ అసలు పేరు బిల్ కప్రీ. ఈ ఘటనలో నిందితుల గురించి ఎలాంటి సమాచారం లేదని, విచారణ జరుపుతున్నామని అక్కడి అధికారులు తెలిపారు. పసిఫిక్ డిజైన్ సెంటర్‌లో మునుపటి ప్రీ-సూపర్ బౌల్ ప్రదర్శన అనంతరం లాస్ ఏంజెల్స్ హాట్‌స్పాట్‌లో తాజాగా జస్టిన్ స్టార్-స్టడెడ్ రివాల్వ్ ఆఫ్టర్ పార్టీని నిర్వహించాడు. డ్రేక్, లియో డికాప్రియో, టోబే మాగైర్, కెండల్ జెన్నర్, ఖోలే కర్దాషియాన్ ఈ ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారు. అయితే బయటకొచ్చిన వీడియో ప్రకారం కొడాక్ బ్లాక్, గున్నా, లిల్ బేబీ మధ్యాహ్నం 2:45 గంటలకు రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా కొంతమంది మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అంతలోనే కాల్పులు జరిగాయి. ఆయా కాల్పుల్లో ఈ ముగ్గురూ గాయపడ్డారు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో బీబర్ దాదాపు 30 నిమిషాల ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా షాన్ మెండిస్, ఆంథోనీ రామోస్, లోగాన్ పాల్, నియాల్ హొరాన్, స్కూటర్ బ్రౌన్‌లతో ఈ కార్యక్రమం అర్ధరాత్రి ముగిసింది. 1,500 మంది ప్రేక్షకులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Exit mobile version