NTV Telugu Site icon

Gouri G. Kishan: ఎవరికీ చూపించని ప్లేస్ లో టాటూ.. ఛీ, నువ్వు కూడానా జాను అంటున్న నెటిజన్స్

Gouri G Kishan Tatto

Gouri G Kishan Tatto

Gouri G Kishan Reveals her Rib tatto Photo: మలయాళ భామ గౌరీ జీ కిషన్ అంటే అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ తమిళ 96 సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన భామ అంటే ఈజీ గానే గుర్తుపడతాం. ఆ తర్వాత మలయాళంలో కూడా ఒక సినిమా చేసిన ఈ భామ తెలుగులో కూడా జాను సినిమాలో సమంత చిన్ననాటి పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత మాస్టర్, కర్ణన్ వంటి తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైంది. కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

Maamannan: తెలుగులో రిలీజయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి!

ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా గౌరీ కిషన్ ఎవరికీ కనిపించని చోట ఒక టాటూ వేయించుకుని షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఆమె అక్కడ టాటూ వేయించుకున్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా దాని షేర్ చేసి దీన్ని రిబ్ టాటూ అంటారు అంటూ కామెంట్ చేసింది. ఇప్పటివరకు సినిమాల్లో చాలా పద్ధతి అయిన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ భామ ఏకంగా అన్నింటికీ సై అని అర్థం వచ్చేలా ప్రైవేట్ పార్టులు కనిపించేలా టాటూ వేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నువ్వు కూడా ఇలా చేస్తున్నావా ఛీ అంటూ పలువురు నెటిజెన్లు ఆమెను మెన్షన్ చేసి కామెంట్లు చేస్తున్నారు. సినిమా అవకాశాలు రావాలంటే వేరే దారులు ఉన్నాయి మరీ ఇంతలా బరితెగించి ఎక్కడో టాటూలు వేయించుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేయాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.