Site icon NTV Telugu

FTPC : ఎఫ్‌టీపిసి సమన్వయ కమిటీల చైర్మన్‌గా నిర్మాత గొట్టుపర్తి

Gottuparthi Madhukar

Gottuparthi Madhukar

నిర్మాతగా ఇంద్రాణి, సునామీ వంటి సినిమాలను చిత్రాలను నిర్మించి సినిమాలకు సంబంధించిన పలు శాఖలలో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష, కార్యదర్సులు అందజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబంధించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ కృషి చేస్తారని అన్నారు. ఇక మధుకర్ మాట్లాడుతూ :- అంతర్ రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాలకై కృషి చేస్తానని అన్నారు. ఇక ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలు ఏర్పాటు చేసిన తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతి త్వరలో ఏర్పాటు చేయనున్నామని , తత్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీఎస్ విజయ్ వర్మ పాకలపాటి పేర్కొన్నారు.

Exit mobile version