NTV Telugu Site icon

ప్రభాస్ పక్కన రాశిఖన్నాకు స్పేస్ దొరికిందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్స్ పునప్రారంభం కానుండడంతో ప్రభాస్ తిరిగి బిజీ కానున్నాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ అభిమానులను సైతం ఆకర్షించాడు. అలాగే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలోనూ ప్ర‌భాస్ నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా ప‌దుకోన్ నటించనుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఆమెను నిర్మాతలు సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తున్న రాశి ఖన్నా.. పలు వెబ్ సిరీస్ లతోను బిజీగా వుంది.