పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడట. పవన్ కాలేజీ లెక్చరర్ గా, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా కనిపించబోతున్నారట. ప్పటికే ఈ చిత్రంలోని అనేక కీలకమైన భాగాలను చిత్రీకరించడానికి భారీ కళాశాల సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘సంచారి’ అనే టైటిల్ విన్పిస్తోంది. కాగా గతంలో పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ మలయాళ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ తెలుగు రీమేక్, దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
‘Pspk28’ గురించి ఆసక్తికర అప్డేట్
