NTV Telugu Site icon

Nag Ashwin: బాలీవుడ్ భామతో పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా!!

Nag Ashwin

Nag Ashwin

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు ఊహించని విధంగా భారీ కలెక్షన్లు సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఆ మూడో సినిమాకి సీక్వెల్ అంటే కల్కి 2 కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆయన మరో పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు.

Amaran: శివకార్తికేయన్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన అమరన్….!

నిజానికి ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా మళ్లీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తెలుగులో అవకాశాల కోసం మాత్రం ప్రయత్నాలు ఆపలేదు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాలో ఆమెను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 2026 తర్వాత నాగ్ అశ్విన్ కల్కి 2 పనులు ప్రారంభించబోతున్నాడు. అంతకన్నా ముందే ఒక పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అశ్వినీ దత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాని కూడా నిర్మించబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Show comments