NTV Telugu Site icon

కాజల్ రెమ్యూనరేషన్ తగ్గించిందా ?

Kajal Agarwal has drastically reduced her remuneration

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. దానికి సమంత, కాజల్ అగర్వాల్ ప్రత్యక్ష నిదర్శనం. అయితే పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మలు ఆచితూచి అడుగులు వేస్తూ సెలెక్టీవ్ గా సినిమాలను ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున సరసన నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరిన్ని సినిమా ఆఫర్లను పొందడం కోసం కాజల్ తన రెమ్యూనరేషన్ ను బాగా తగ్గించిందట. ఇంతకుముందు తీసుకుంటున్న పారితోషికంతో సగాన్ని మాత్రమే తీసుకుంటోందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న “ఆచార్య” షూటింగ్ దశలో ఉంది. ప్రవీణ సత్తారు, నాగార్జున చిత్రంలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.