NTV Telugu Site icon

బ్రదర్‌ ఆఫ్‌ దేవరకొండ.. మరో హిట్‌..

బ్రదర్‌ ఆఫ్‌ దేవరకొండ (ఆనంద్‌ దేవరకొండ).. న్యూ మూవీ ‘పుష్పక విమానం’. దొరసాని సినిమాతో కథనాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆనంద్‌ దేవరకొండ. రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సొదరుడైనా కూడా.. తన దైన నటనా శైలితో ముందుకు వెళుతున్నారు. దొరసాని సినిమా తరువాత ఆనంద్‌ నటించిన సినిమా మిడిల్‌ క్లాస్ మెలోడీస్‌.. ఈ సినిమా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు చిత్ర యూనిట్‌.

ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే సాధించింది. ఆ తరువాత ఆనంద్‌ నటించిన సినమా ‘పుష్పక విమానం’. ఈ రోజు ఈ సినమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులను కదిలిస్తే.. ఆద్యంతం వినోదభరితంగా సాగిందనే సమాధానం వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బ్రదర్‌ ఆఫ్ దేవరకొండ .. మరో హిట్‌ కొట్టినట్టే..