NTV Telugu Site icon

Gopichand : హిస్టారికల్ మూవీతో రాబోతున్న గోపీచంద్ !

Gopichandh

Gopichandh

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం హీరోగా వరుస సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఇక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా గోపీచంద్ తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనుండగా, గోపీచంద్ కెరీర్ లో 33వ సినిమాగా రానున్న ఈ చిత్రాని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

Also Read:Varalaxmi : డబ్బు కోసం రోడ్డు మీద డ్యాన్స్ చేశా..

ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమంతో నటీనటులు, చిత్ర సిబ్బంది మధ్య ఈ సినిమా లాంచ్ అయింది. కాగా ఈ చిత్రం పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ ముఖ్యమైన చారిత్రక సంఘటనల ఆధారంగా చేసుకుని స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో గోపీచంద్ రోల్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, రోల్స్‌కు సంబంధించిన వివరాలు తెలుపనున్నారు.