Site icon NTV Telugu

Gopichand 32 Viswam: మాస్ గోపీచంద్ ఈజ్ బ్యాక్.. ఇదేంటన్నా ఈ రేంజ్ లో ఉంది!

Gopichand 32

Gopichand 32

Gopichand 32 Viswam First Strike Released: మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈద్ సందర్భంగా ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేసి ఒక మాస్ ఫీస్ట్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్32కి ‘విశ్వం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూస్తే వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలు వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం , రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో ప్రారంభమయింది.

Kartikeya 8: హ్యాపీడేస్ టైసన్‌తో కార్తికేయ సినిమా.. భలే సైలెంటుగా పూర్తి చేశారే?

గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇవ్వగా అనంతరం అది గిటార్ కాదు, మెషిన్ గన్ అని చూపడం ఆసక్తి రేపుతోంది. ఇక ఆశ్చర్యకరంగా అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభించి అక్కడ ఫుడ్ ని ఆస్వాదిస్తూ, “దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్… ఇస్పే లిఖా మేరే నామ్..’ అని చెప్పడం చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తోంది. లైట్ గా ఉన్న గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకునిస్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని నెగెటివ్‌ షేడ్‌లో చూడటం నిజంగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తోంది. గోపీచంద్‌ డైలాగ్ పలికిన విధానం, క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్ ని మాస్ ఫీస్ట్ గా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సహా ఇతర వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Exit mobile version