Site icon NTV Telugu

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసిన నటుడు.. ఎవరో తెలుసా..?

Sunder

Sunder

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం ఆయనను చూసి గర్వపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. చెన్నెలో పుట్టి పెరిగిన సుందర్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఇప్పటికీ చెన్నెలోనే సుందర్ పిచై సొంత ఇల్లు ఉన్న విషయం తెల్సిందే. అయితే ఇకముందు ఆ ఇల్లు ఉండదు. సుందర్ పిచై పుట్టి పెరిగిన ఆ ఇంటిని అతని తండ్రి విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసింది ఎవరా..? అని ఆరాలు మొదలుకాగా.. ఆ ఇల్లును కొన్నది తమిళ నటుడు, నిర్మాత అయిన మణికందన్ అని తెలుస్తుంది. తమిళ్ లో మంచి సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన మణికందన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లును కొంగలు చేసినట్లు తెలిపారు. సుందర్ పిచై తండ్రి.. ఆ ఇంటిని కూల్చివేసి.. మణికందన్ కు అమ్మారట.

Malavika Mohanan: ఈ ప్రభాస్ హీరోయిన్ చాలా ట్రెండీ గురూ…

ఇక ఈ విషయమై మణికందన్ మాట్లాడుతూ.. ” గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లును కొనుగోలు చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సాధించిన విజయాలు మొలకెత్తడానికి ఈ ఇల్లే పునాది. అలాంటి ఇంటిని నేను కొనుగోలు చేసినందుకు గర్వపడుతున్నాను. ఇక నేను ఈ ఇల్లు కొనడానికి అమెరికాలో నాలుగు నెలలు ఉన్నాను. అక్కడ పిచై తండ్రిగారితో మాట్లాడి.. ఆ ఆస్తి పత్రాలు అన్ని తీసుకొని రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది. ఇక ఆ ఇంటి పత్రాలు ఇచ్చేటప్పుడు వారు చాలా ఎమోషనల్ అయ్యారు. మొదటి ఆస్తిగా అది వారు భావించినట్లు” చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఇంటిని ఎంత రేటుకు కొనుగోలు చేశారు అనేది మాత్రం మణికందన్ గుట్టుగా ఉంచాడు.

Exit mobile version