Upasana Konidela Delivery Date: మెగా ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందా? అంటే అది రామ్ చరణ్ సంతానం అని చెప్పక తప్పాడు. ఎందుకంటే రామ్ చరణ్-ఉపసాన ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని చాలా కాలమే అయింది. అయినా మొన్నటి వరకూ వీరి సంతానం విషయం మీద క్లారిటీ లేదు. అయితే కొన్నాళ్ళ క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు అనే వార్త అధికారికంగా ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇక ఉపాసన-రామ్ చరణ్ దంపతులు పదేళ్ల తర్వాత పేరెంట్స్ అవుతున్నారని, ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని మామయ్య చిరంజీవి అభిమానులతో అప్పట్లో పంచుకున్నారు. ఆ హనుమాన్ అశీస్సులతో ఉపాసన తల్లి కాబోతున్నారని ట్వీట్ చేశారు. Anasuya Bharadwaj: నన్ను అందులోకి లాగకండి బాబోయ్!ఇక తల్లి కాబోతున్నట్టు క్లారిటీ వచ్చిన తరువాత కూడా వీరిది సరోగసీ గర్భం అని కొందరు కామెంట్లు చేశారు. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో సరదాగా చేసిన కామెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఉపాసన అమెరికాలో డెలివరీ కానుంది అంటూ కూడా వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇక ఆ తరువాత ఉపాసన వాటిపై స్పందిస్తూ నా మొదటి బిడ్డకు ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జన్మనిస్తాను అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉపాసనకు జన్మించేది బాబో పాపనో క్లారిటీ లేదు కానీ మెగా అభిమానులు అయితే వారసుడు అనే ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ ఇంటికి రేపే వారసుడు లేదా వారసురాలు వచ్చేది అని తెలుస్తోంది అంటే ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ జననం రేపే…! అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది రేపటితో తేలిపోనుంది.
Mega Family: మెగా ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్…వారసుడి రాకకు ముహూర్తం ఫిక్స్?
Show comments