NTV Telugu Site icon

Shahid Kapoor: పైడిపల్లితో షాహిద్ కపూర్.. తెలుగులో దిగుతున్న బడా బాలీవుడ్ సంస్థ!

Shahid Kapoor Net Worth 2023 Salary Car Wife Business

Shahid Kapoor Net Worth 2023 Salary Car Wife Business

Gold Mine Company Entering Tollywood with Shahid Kapoor- Vamsi paidipally movie: ఈ మధ్యకాలంలో సినిమాల మధ్య భాషా భేదం పూర్తిగా తొలగిపోతుంది. తెలుగు నుంచి వెళ్లి హిందీ, తమిళ హీరోలతో దర్శకులు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల దర్శకులు వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ అయింది. దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి మొదటి నుంచి దిల్ రాజు నిర్మాణంలోనే సినిమాలు చేస్తూ వస్తున్న వంశీ పైడిపల్లి ఏకంగా ఒక బాలీవుడ్ హీరోని లైన్లో పెట్టారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో వంశీ పైడిపల్లి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి ఒక నిర్మాణ సంస్థగా దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ వ్యవహరించబోతోంది. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది.

Prasanth Varma: ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ వర్మ..

అదేమిటంటే బాలీవుడ్ కి చెందిన గోల్డ్ మైన్ అనే సంస్థ కూడా ఈ సినిమాతో తెలుగు సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే గోల్డ్ మైన్ సంస్థ అనేక తెలుగు సినిమాలను కొనుగోలు చేసి హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ మంచి ఆదాయం గడిచింది. అంతేకాదు గోల్డ్ మైన్ పేరుతో ఒక ఛానల్ కూడా రన్ చేస్తూ ప్రధానంగా సౌత్ సినిమాలను హిందీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ షాహిద్ కపూర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాని ముందుగా తెలుగు హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అనుకూలతను బట్టి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.