మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బబడ్జెట్ చిత్రాలలో “గాడ్ ఫాదర్” ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ టైటిల్ ను కూడా ప్రకటించారు. సినిమా షూటింగ్ ను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో పూర్తయింది. తరువాత చిరు తర్వాత ఒక పాట చిత్రీకరణ కోసం “ఆచార్య” సెట్స్‌కి వెళ్లారు.
Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని
తాజా అప్‌డేట్‌ల ప్రకారం “గాడ్‌ఫాదర్” రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. వారం రోజుల షెడ్యూల్‌లో అనేక కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సన్నివేశాల కోసం అద్భుతమైన లొకేషన్లలు ఇప్పటికే మేకర్స్ సెట్ చేశారట. తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఊటీకి వెళ్తుంది. “గాడ్‌ఫాదర్”లో కీలక పాత్రలు పోషించే పలువురు ప్రముఖ నటులపై ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు.
