Site icon NTV Telugu

God Father: బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే.. బాక్సులు బద్దల్రే

Chiru

Chiru

God Father: వచ్చేసింది.. వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఇద్దరు మెగాస్టార్లు కలిసి రచ్చ చేసిన సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే మెగాస్టార్, సల్మాన్ ఖాన్ చిందేసిన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఫుల్ సాంగ్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోగా కాకుండా ఆడియో గా అందించారు. స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. “బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే.. బాక్సులు బద్దల్రే.. యాష్ కరే యాష్ కరే” అంటూ మొదలైన ఈ సాంగ్ ఒక ఊపు ఉప్పేస్తుంది.

టాలీవుడ్ ను బాలీవుడ్ ను తారుమరయ్యే తార్ మార్ తక్కర్ మార్ అంటూ ఇద్దరు స్టార్లు ఓ రేంజ్ లో ఎత్తిపడేశారు. మెగాస్టార్ గొప్పతనం, కండల వీరుడు వ్యక్తిత్వాన్ని కలిపి లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ కు జోహార్లు చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడు వినే మాస్ గొంతులా కాకుండా శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేస్తూ పాడి అదరగొట్టేసింది. థమన్ పార్టీ సాంగ్స్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. త్వరలో ఈ సాంగ్ కూడా ఒక చార్ట్ బస్టర్ గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ లిరికల్ వీడియోలో ఈ బాసులు వేసే స్టెప్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఈ సాంగ్ కు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా స్టెప్స్ నేర్పించాడు. చిరు, సల్మాన్, ప్రభుదేవా.. వ్వాట్ ఏ కాంబో అని అభిమానులు అంటున్నారు. ఈ లిరికల్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి.

Exit mobile version