Site icon NTV Telugu

Akkineni Nagarjuna: బిగ్ బ్రేకింగ్.. అక్రమ నిర్మాణల కేసులో నాగార్జునకు నోటీసులు

Nag

Nag

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున మరో వివాదంలో చిక్కుకున్నాడు. గోవాలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నది గోవాలోని ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ నాగ్ కు నోటీసులు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. అక్కినేని నాగార్జున గోవాలోని మాండ్రేమ్ అనే గ్రామంలో ఒక అందమైన ఇంటిని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే అది అక్రమ నిర్మాణం అని, ముందస్తు అనుమతులు లేకుండా నాగ్ ఈ నిర్మాణాలు చేపట్టడంతో మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు నోటీసులు పంపారు.

“ముందస్తు అనుమతి లేకుండా సర్వే నం. 211/2బి ప్రాంతంలో మీ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపకపోతే పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసులపై నాగ్ ఇప్పటివరకు స్పందించలేదని తెలుస్తోంది. మరి నాగ్ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version