Charan: రామ్ చరణ్ ఎంట్రీకి రిపీట్స్ పడాల్సిందే… లుక్ ఇరగదీసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ మిక్స్ చేస్తూ పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకీ మామ, పూజా హెగ్డేలు కనిపించారు. లుంగీ కట్టి సల్మాన్, వెంకీ స్వాగ్ తో డాన్స్ చేశారు. ఈ ఇద్దరితోనే మంచి జోష్ లోకి వస్తున్న టైంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తూనే ఉంది. దాన్ని నిజం చేస్తూనే ‘ఎంటమ్మ’ సాంగ్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేశాడు, దానికి పే ఆఫ్ గా చరణ్ ఈరోజు ‘ఎంటమ్మ’ సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు.
ఎల్లో షర్ట్, వైట్ లుంగీ ఎత్తి కట్టి చరణ్ డాన్స్ చేస్తుంటే మాస్ ఆడియన్స్ ని ఫుల్ పీల్స్ పెట్టినట్లు ఉంది. అతని బాడీ లాంగ్వేజ్ లో స్వాగ్ అండ్ స్టైల్ దెబ్బకి సాంగ్ లో ఇంకెవరూ కనిపించకుండా పోయారు. స్టార్టింగ్ లో వెంకటేష్, సల్మాన్ తో కలిసి నాటు నాటు టైపు స్టెప్ వేసిన చరణ్… ఆ తర్వాత సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలతో ఎంటమ్మ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేశాడు. పూజాని కూడా పక్కకి నెట్టి సల్మాన్, చరణ్ మాత్రమే డాన్స్ చేశారు. ఇక లాస్ట్ లో తను మాత్రామే కనిపిస్తూ చరణ్ డాన్స్ చేసిన విధానం మెగా అభిమానులకే కాదు పాన్ ఇండియా అభిమానులకి కూడా నచ్చేలా ఉంది. సింపుల్ స్టెప్స్ ని అంతే సింపుల్ గా చాలా ఈజ్ తో చేశాడు చరణ్. ఈ రేంజ్ మాస్ లుక్ లో చరణ్ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. ఇలాంటి లుక్ ఒక పూర్తిస్థాయి సినిమా చేస్తే చరణ్, ప్రతి ఒక్కరికీ మెగాస్టార్ నటించిన ‘ముఠామేస్త్రీ’ ఫీల్ ఇవ్వడం గ్యారెంటీ. మరి చరణ్ తో ఫ్యూచర్ లో సినిమా చెయ్యబోయే దర్శక నిర్మాతలు చరణ్ ని ఇలాంటి మాస్ లుక్ లో చూపించే ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. మొత్తానికి ఈ ఒక్క సాంగ్ తో సల్మాన్ ఖాన్ సినిమా మార్కెట్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ కొంచెమైనా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
Also Read
#Yentamma song out now…https://t.co/aUFhhNZ8s8@AlwaysRamCharan @hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani
— Salman Khan (@BeingSalmanKhan) April 4, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!