Site icon NTV Telugu

Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. !

Bhati

Bhati

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Also Read: Manchu Manoj : నా పాత్ర మోడ్రన్ రావణుడి వెర్షన్ లాంటిది..!

ఈ సినిమా ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమాను వీక్షించిన తర్వాత నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని, క్రిష్‌ మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చారని అంటున్నారు. బీజీఎం.. ఫైట్ సీన్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్‌ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రైన్ సీక్వెన్స్‌ వేరే లెవెల్ అని.. సెకండాఫ్‌లో ఫుల్ మీల్స్‌ ఖాయమని.. టాలీవుడ్ క్వీన్‌ అనుష్క క్లైమాక్స్‌లో అదరగొట్టేసిందని అంటున్నారు. మరికొందరైతే యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.

Exit mobile version