Site icon NTV Telugu

Geethanjali Malli Vachindi: స్మశానంలో ఈవెంట్ క్యాన్సిల్.. ఆత్మల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని అక్కడికి మార్పు!

Geethanjali Malli Vachindi

Geethanjali Malli Vachindi

Geethanjali Malli Vachindi Event Cancelled at Grave yard: అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగం పేట శ్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేసి అనౌన్స్ చేశారు మేకర్స్. హారర్ చిత్రం కావటంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్‌ను ఇలా ప్లాన్ చేసింది.

Pawan Kalyan:”ఆంధ్రలో ఏదైనా మార్పు వస్తే పవన్ ద్వారానే రావాలి.. అల్లు అర్జున్ మామ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అక్కడి ఈవెంట్ మారుస్తున్నట్టు ప్రకటించింది టీం. ఆత్మల ఆత్మగౌరవాన్ని, మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని, భయబ్రాంతులవుతున్న మా యూనిట్ సభ్యులను అర్థం చేసుకుంటూ, కొంతమంది స్నేహితులు, పాత్రికేయ మిత్రుల సలహా సూచనలను గౌరవిస్తూ, మా టీజర్ లాంచ్ వెన్యూ ని ” దసపల్లా కన్వెన్షన్” కు మార్చడమైనదని ప్రకటించారు. ఇక గీతాంజలి సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేేష్, షకలక శంకర్, సత్య, సునీల్, రవి శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలో మెప్పించనున్నారు. అమెరికాలోని అట్లాంటాకు చెందిన కొరియోగరాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.

Exit mobile version